ఆంద్రప్రధేశ్ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటి.
వేసవి తాపంతో వడదెబ్బ తగలకుండా ప్రజలు సంచరిచే బస్టాండు, రైల్వే స్టేషన్లలో, ప్భుత్వ ఆసుపత్రులలో , ఇతర జన సమ్మర్ధ ప్రాంతాలలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశించారు..
ఇందుకోసం జిల్లాకు 3 కోట్ల రూపాయల లెక్కన మంజూరుచేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రకటనలు కూడా బాగానే చేసింది ఆంద్రప్రధేశ్ ప్రభుత్వం.
నేటికి కూడా ఒక్క వ్యక్తికి కూడా ఈ ఉచిత మజ్జిగ అందిన ధాఖలాలు లేవు మన నెల్లూరు జిల్లాలో,
వేసవి కాలంలో 45 రోజులపాటు ప్రజలకు అందించాలంటూ కోరిన ప్రభుత్వానికి జిల్లా నాయకులు, అధికారులు కుచ్చుటోపి పెట్టారనటానికి ఏం సందేహం లేదు..
రేపో మాపో నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి.. మరి సర్కారోల్లు మాటలు మాత్రమే మాట్లాడుతారు చేతల్లో చేసి చూపలేరని తెలిసిపోయింది..
ఒక వేళ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసుంటే ఆ మొత్తం ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో తెలియాల్సిఉంది...
No comments:
Post a Comment