Friday, June 17, 2016

కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!

‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.

2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.

3. ఆత్మకు జననం, మరణం లేదు.

4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం.

5. యమధర్మ రాజు చెప్పిన దాని ప్రకారం దేవున్ని నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.
ఆత్మల గురించిన ప్రస్తావన….
భగవద్గీత లో.
శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక “అహం బ్రహ్మస్మి” నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి

Monday, June 6, 2016

సబ్ రిజిస్టర్ కార్యాలయం కిటికీ నుండి ఎగిరి పడ్డ నోట్ల కట్టలు..!!!

ప్రకాశం జిల్లా  మార్క్ పురం సబ్ రిజిస్ట్ర్ ర్ కార్యలయం నుంచి నిన్న సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి.

తనిఖిలకు వచ్చిన ACB బృందాన్ని చూసి కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది నోట్లకట్టలను కిటికిల్లో నుంచి బయటకు విసిరేశారు అయితే గమనించిన ACB అధికారులు వాటిని స్వాధినం చేసుకున్నారు దస్తావేజు లేఖరుల కార్యాలయలను తమ స్వాధినంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు కిటికిల్లో నుంచి బయటకు వచ్చిన నగదు లక్ష వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

మజ్జిగ పంపిణీ అతిధిగా కందుకూరి సత్యనారాయణ..!!!

కావలి పట్టణం లోని శివాజి సెంటర్ లో ది కావలి జనరల్ మర్చంట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అతిధిగా బి.జె.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి వెంకట సత్యనారాయణ విచ్చేశారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ నలుగురికి సహాయపడడం అనేది దేవుని యొక్క పుణ్య ఫలితం అని అది అందరూ చేయలేరు అని అన్నారు.. ఇటువంటి సేవలు మరెన్నో చేయాలని ఆయన అన్నారు . ఈ కార్రక్రమంలో ది కావలి జనరల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

విట్స్ మరియు వెక్ కళాశాలలో జరుగుతున్నటు వంటి మరణాలపై కరపత్రం విడుదలచేసిన పి.డి.యస్.యు...!!!

కావలి పట్టణం లోని విట్స్ మరియు వెక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస మరణాలపై వివరణ కోరుతూ కాలేజీ యాజమాన్యపు నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ ఈ రోజు విధ్యార్ది సంఘం పి.డి.యస్.యు ఆధ్వర్యంలో   కరపత్రం విడుదలచేయడం జరిగింది..

Saturday, June 4, 2016

రైల్వే జోను ఏర్పాటు మా తక్షణ ప్రాధాన్యం రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు...!!!


కేంద్రమంత్రి, అధికారులతో సీఎం మూడు గంటలపాటు సమీక్ష
   రాష్ట్ర విభజనతో అనేకవిధాల నష్టపోయామని, రైల్వే జోన్‌ను కోల్పోయామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా శనివారం  సీఎంఓకు వచ్చిన రైల్వే మంత్రి శ్రీ సురేష్ ప్రభు, అధికార బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.

  తమ తక్షణ ప్రాధాన్యం రైల్వే జోను ఏర్పాటేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రైల్వేజోను ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించటంతో పాటు, రాష్ట్రానికి అనేక ప్రయోజనాలుంటాయన్నారు. రాజధాని అమరావతిని కలుపుతూ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. పుష్కరాల సందర్భంగా రైలు స్టేషన్ల సుందరీకరణకు, ప్రయాణీకులకు సదుపాయాల కల్పనకు బీఆర్టీఎస్ రోడ్డు వెడల్పు చేయాల్సి ఉందని, అందుకోసం రైల్వే భూమి అవసరమని, అడిగిన భూమిని తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి రైల్వే మంత్రిని కోరారు. పుణ్యక్షేత్రాలున్న రైల్వేస్టేషన్లు పుష్కరాల సందర్భంగా ప్రయాణీకులతో కిటకిటలాడతాయని, అందువల్ల స్టేషన్లను ఆధునీకరించాలని, సుందరీకరణకు,సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
  నవ్యాంధ్ర రాజధానికి అమరావతికి విజయవాడ, గుంటూరులతో కలుపుతూ  రైల్వేలైను నిర్మించాలని  విజ్ఞప్తిచేశారు.  అనంతపురం, రాయలసీమ జిల్లాల నుంచి రాత్రివేళ బయలుదేరి ఉదయమే విజయవాడ చేరుకునేలా వీలయినంత త్వరలో ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ముఖ్యమంత్రి కోరారు.

  రాజధానిలో పనిచేయనున్న ఉద్యోగులకు సదుపాయంగా ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. విజయవాడ-అనంతపురానికి మలుపులు లేకుండా నేరుగా నిర్మించ తలపెట్టిన రోడ్డు మార్గం పక్కనే అనంతపురానికి రైల్వే లైను నిర్మించాలని కోరారు. రాయలసీమలోని నాలుగుజిల్లాలకు ఈ రైలుతో అత్యంత ప్రయోజనం ఉంటుందని, అతి తక్కువ సమయంలో రాయలసీమవాసులు నూతన రాజధానికి  రావటానికి వీలవుతుందని చెప్పారు.

   హైస్పీడు రైళ్లు విశాఖ-చెన్నయ్, అమరావతి-బెంగళూరు మధ్య నడపాలని కోరారు. రైల్వే శాఖ నిర్మించతలపెట్టిన 3వ రైల్వే లైను త్వరగా నిర్మించాలని, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు. రాజమండ్రిలో హెవలాక్ రైలు వంతెనను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేమంత్రికి విజ్ఞప్తిచేశారు. పుష్కరాల సందర్భంగా నిర్వహించటానికి రైల్వే ప్రొటెక్షన్ బోర్డుకు సమర్ధులైన అధికారులను నిమయించాలని, తద్వారా గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తిన సమస్యలు రాకుండా చూడాలని కోరారు. విశాఖ నుంచి రాయపూర్, నాగపూర్ మీదుగా కొత్తఢిల్లీ , ముంబై వెళ్లే రైల్వే లైన్లను హైస్పీడు రైళ్లు వెళ్లినా తట్టుకునేలా పటిష్టపర్చాలని చంద్రబాబు కోరారు. ఢిల్లీ నుంచి వేరొక మార్గం ఏర్పడితే వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా సులువవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

  విశాఖ నుంచి ముంబై కారిడార్ ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాల సందర్భంగా అన్ని రైలు స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకుల రద్దీని తట్టుకునేలా చేయాలని, వారికి వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రైల్వే మంత్రిని కోరారు.

  రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై రైల్వే శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా సీఎం స్పందిస్తూ రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని కేంద్రమంత్రి సురేష్ ప్రభును కోరారు.

  కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందిస్తూ ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. తగిన ప్రణాళికను సిద్ధంచేయాలని కోరారు. తనను రాజ్యసభకు ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైల్వేమంత్రి సురేష్ ప్రభు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, రాష్ట్ర రథసారథి చంద్రబాబుకు  రుణపడివుంటానని, ఏపీ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానని స్పష్టంచేశారు.   కలకత్తా-చెన్నై హై స్పీడు రైలు, సమీప భవిష్యత్తులో అమరావతి-బెంగళూరు హైస్పీడు రైలు మంజూరు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో లాజిస్టిక్ హబ్‌ అవుతుందని, ఎగుమతులు, దిగుమతులకు కేంద్రమవుతుందని, పోర్టులు, ఎయిర్ పోర్టులను కలుపుతూ రైల్వే లైన్లను నిర్మిస్తామని, ఇందుకు సర్వే చేస్తామని తెలిపారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కోరినప్పుడల్లా  ముఖ్యమంత్రికి వివరించాలని రైల్వే అధికారులను మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని, తమను పలుమార్లు కలిశారని, ఈరాష్ట్రాభివృద్ధికి ఆయన పడుతున్న తపన చూసి ఆశ్చర్యం వేస్తున్నదని ప్రశంసాపూర్వకంగా అన్నారు.

రైల్వే శాఖాపరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.  హైస్పీడు రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. డైనమిక్ లీడర్ సురేష్ ప్రభు అని ఆయన రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ఆవేదనను అర్ధంచేసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమావేశంలో  కేంద్ర మంత్రి, ఇటీవల తిరిగి రాజ్యసభకు ఎన్నికైన శ్రీ వైఎస్ చౌదరి, రాష్ట్ర మంత్రి డా. కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, నిమ్మల కిష్టప్ప, ముఖ్యమంత్రి కార్యాలయ సహాయ కార్యదర్శి శ్రీ అడుసుమల్లి రాజమౌళి, ఏడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు, ఐఏఎస్ అధికారి శ్రీ శ్యాంబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాబు ఎ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గుప్త, రైల్వే బోర్డు (ట్రాఫిక్) మెంబర్ మహ్మద్ జంషెడ్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజల్లో 80% సంతృప్తి,సంతోషం లక్ష్యంగా పనిచేయాలి ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరికో వనం మూడోరోజు నవనిర్మాణదీక్ష, టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు...!!!


     రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు  నాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్ష మూడోరోజు అయిన శనివారం ఉదయం గుంటూరు జిల్లా ఉండవల్లి లోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమంపై ప్రజల్లో  80% సంతృప్తి, సంతోషం ప్రజల్లో కనిపించాలనే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంగా  పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరికో వనం...కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతి నియోజకవర్గంలో 1000 మొక్కలు నాటాలని దిశానిర్దేశం చేశారు.  ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన పంచాయితీలకు, స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
  బహిరంగ విసర్జన రహిత గ్రామాలకు రూ.5 లక్షలు,  వంద పంటకుంటలు తవ్విన గ్రామాలకు రూ.4 లక్షలు, ఇంటికో ఇంకుడు గుంత సాధించిన గ్రామానికి రూ.2 లక్షలు, 50 వర్మి కంపోస్టు యూనిట్లు మహిళా సంఘాలు నెలకొల్పితే రూ.2 లక్షలు, మూడు కి.మీ. పొడవునా, లేదా 1200 మొక్కలు నాటి పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహకం ఇస్తామని చెప్పారు.
         గ్రామంలో నాలుగు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహకం ఇస్తామన్నారు.  సంక్షేమ పథకాల వల్ల ఆయా కుటుంబాలకు కలిగిన ప్రయోజనాలు, వాటిద్వారా వచ్చిన ఫలితాలపై లబ్దిదారులతో నవనిర్మాణ దీక్ష సభల్లో మాట్లాడించాలని చంద్రబాబు సూచించారు. రూ.1000 పింఛను వల్ల తన కుటుంబానికి ఎంత సంతృప్తి వచ్చిందో, రేషన్ బియ్యం 4 కిలోలనుంచి 5 కిలోలకు పెంచి ఆంక్షలు లేకుండా కార్డులో పేర్లున్న అందరికీ సరఫరా చేయడంవల్ల ఆకుటుంబానికి ఎంతమేలు కలిగిందో వివరించాలన్నారు. పొలంలో తవ్విన పంటకుంటలోకి నీరు చేరడంవల్ల ఎంత సంతృప్తి వచ్చిందో సదరు లబ్దిదారులతోనే ఆయా సభల్లో మాట్లాడిస్తే మిగిలినవారికి స్ఫూర్తిదాయకం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలపై సమగ్రంగా చర్చిస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాలని, అమలు తీరును విశ్లేషించాలని సూచించారు.
      

మరింత చర్చ జరగాలి
‘2014 జూన్ 4న మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? రెండేళ్లలో ఎంత సాధించాం? ఇంకా సాధించాల్సింది ఎంత ఉంది? ఇత్యాది అంశాలపై సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు చర్చించాలి, భవిష్యత్తు దిశానిర్దేశం చేసుకోవాలి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు సమన్వయంగా పనిచేయాలని కోరారు. రాబోయే నెలరోజుల్లో 6 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వకం పనులు పూర్తిచేయాలన్నారు. ఫిజియో మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భజలమట్టం జిల్లా యంత్రాంగం పరిశీలించి అందుకుతగ్గ చర్యలు చేపట్టాలన్నారు.
  ఒకప్పుడు గంటల తరబడి కరెంటు కోతలు, పవర్ హాలీడేలతో పంటలు ఎండిపోయి రైతులు పడ్డ ఇబ్బందులు, క్రాప్ హాలీడేలు ప్రకటించిన దుస్థితి ఉండేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  పవర్ హాలీడేలతో ఫ్యాక్టరీలు మూతబడి కార్మికులు ఉపాధి కోల్పోయిన దయనీయస్థితి ఉండేదని, అప్పటి ప్రభుత్వ నిర్వాకాన్ని, నిరంతర విద్యుత్ సరఫరాతో ఇప్పటి ప్రభుత్వం కలిగించిన మేలుపై ప్రజలు బేరీజు వేస్తున్నారని, దీనిపై మరింత చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

  జూన్ 8న ‘మహా సంకల్పం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాబోయే మూడేళ్లలో మరింత ఉత్సాహంగా, ఉద్యమ స్ఫూర్తితో కలసి  కృషి చేయాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దాదాపు 6126 మంది ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Friday, June 3, 2016

పట్టుదలతో శ్రమిస్తే ఫలితాలు, నవ నిర్మాణ దీక్షపై సీయం టెలికాన్ఫరెన్స్...!!!

‘చరిత్రలో ఒక మలుపులో ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తే వెనక్కిపోతాం, పట్టుబట్టి ముందుకు వెళ్తే ఊహించని ఫలితాలు సాధిస్తాం’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని తన నివాసం నుంచి 5,600 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందితో శుక్రవారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన వల్ల జరిగిన నష్టాన్ని కష్టంతో అధిగమిద్దామని, రాష్ట్రాన్ని విడదీసిన  వాళ్లే విస్తుపోయేలా అభివృద్ది సాధిద్దామని ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు.

విభజన అసమానంగా జరిగిందంటూ, ఆదాయం 47%, జనాభా 58% రావడంతో మొదటి రెండేళ్లు ఆర్దికంగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి  వివరించారు. తొలి ఏడాదిలో రూ.16 వేల కోట్ల రెవిన్యూలోటు వస్తే కేంద్రం రూ. 2,300 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 9, 10 షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థలు, కంపెనీల విభజన రెండేళ్లు గడిచినా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పొరుగు రాష్ట్రంతో సమస్యలు తలెత్తుతున్నాయని, త్వరితగతిన దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నదని అన్నారు.
2019-20 నాటికి ఈశాన్య రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌కే ఆర్ధికలోటు ఎక్కువగా  ఉంటుందని 14వ ఆర్ధిక సంఘం పేర్కొన్న విషయం ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో నగరీకరణ తక్కువగా ఉన్నందువల్ల ఆదాయంలో వెనుకంజలో ఉన్నామన్నారు.  గత రెండేళ్లలో ఆదాయం 3% పెంచామని, జాతీయ స్థాయికన్నా వృద్దిలో 3% ముందంజలో ఉన్నామని, మరింతగా మనం నిలదొక్కుకోవాలంటే ఇదే స్పూర్తితో రాబోయే మూడేళ్లు పనిచేయాలని, అప్పుడే  అనుకున్న ఫలితాలు సాధిస్తామని చెప్పారు.

నవ నిర్మాణ దీక్షలో పాల్గొని అందరికీ స్పూర్తినిచ్చిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలకు సీయం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తిని కడదాకా కొనసాగించాలని, రాబోయేకాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో, ప్రపంచంలో సమున్నతంగా నిలపాలని మార్గదర్శనం చేశారు. 

తలసరి ఆదాయంలో పొరుగు రాష్ట్రాలకన్నా వెనుకబడి ఉన్నామంటూ, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,03,000 తలసరి  ఆదాయం ఉంటే, తెలంగాణలో రూ,1,38,000, కర్ణాటకలో రూ.1,40,000 తలసరి  ఆదాయం ఉన్న విషయం గుర్తుచేశారు. వాటితో సమాన స్థాయికి చేరేదాకా ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అప్పటి వరకూ ఎవరూ విశ్రమించరాదన్నారు. నవ నిర్మాణ దీక్షాదినం నుంచి మహా సంకల్పం వరకు ఈ వారం రోజులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. వివిధ రంగాలలో నిష్ణాతులచే ప్రసంగాలు ఇప్పించాలని, వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు నాందిపలికేలా చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

వై.యస్.జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు...!!!


సీఎం చంద్రబాబు బాబు పై ,  వై.యస్.జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ,
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండల కేంద్రం లో  సీఎం చంద్రబాబు నాయుడు పై వై,యస్ జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండిపడ్డ తెలుగు తముళ్లు....రోడ్డు పై బైఠాయించి న టీడీపీ నాయకులు...
జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీడీపీ నాయకులు......నల్లమాడ ,పుట్టపర్తి, కొత్తచేరువు, అమడగూరు, బుక్కపట్నం మండలాల్లో జగన్ దిష్టి బొమ్మ దగ్డం చేసిన టీడీపీ నాయకులు.....

Thursday, June 2, 2016

పెను ప్రమాదం నుండి బయటపడిన కావలి గాంధీ విగ్రహ వ్యవస్థాపకుడు పాదర్తి నాగరాజు..!!!

కావలి పట్టణం లోని ట్రంకురోడ్డులోని  గాంధీ విగ్రహ వ్యవస్థాపకుడు మరియు హోల్ సేల్ గా చింతపండు షాపును నడుపుతున్నటు వంటి పాదర్తి నాగరాజు కటుంబ సభ్యులకు  సోమవారం పెను ప్రమాదం తప్పింది..

వేసవి సెలవలలో చల్లని ఊటీ ప్రదేశాన్ని విహారయాత్రగా ఎంచుకుని బయలుదేరిన వారికి తిరుపతి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది..

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతినగా,  పాదర్తి నాగరాజు కుటుంబసభ్యులు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు..

దగ్గర లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

Wednesday, June 1, 2016

ది కావలి జనరల్ మర్చ 0ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు మజ్జిగ పంపిణీ....!!!

తేది02-06-16 న

ది కావలి జనరల్ మర్చ 0ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  స్థానిక శివాజి సెంటర్ వద్జ  మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని ది కావలి జనరల్ మర్చ 0ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెలిపారు.. రేపు జరుగుతున్నటు వంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమము దాత వెంకన్న ఫాన్సీ ..
   
ముఖ్య అతిదిగా   మున్సిపల్ ఛైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య విచ్చేయుదురు.

ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతి సంరక్షణ, ఏపీ ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ఎంఓయూ భేటి...!!!


ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతి సంరక్షణ
ఏపీ ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ఎంఓయూ
మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృందంతో  సీఎం చంద్రబాబు భేటీ
విజయవాడ, జూన్ 1:  ప్రపంచంలోనే విశిష్టమైన ఒంగోలు జాతిగిత్తలు, పుంగనూరు ఆవుల సంతతిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం తమమీద ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
బుధవారం సీఎంఓలో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా నుంచి వచ్చిన ‘మిల్క్ మిషన్’ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వారికి వివరించారు.  ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి చోదక శక్తులుగా ఉన్నాయని, అధికాదాయం వస్తోందని చెప్పారు. అందువల్ల పాడిపరిశ్రమ అభివృద్ధికి,  పశుగణాభివృద్ధిపై ప్రత్యకంగా దృష్టి పెట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు.  నాలుగు లీటర్లకంటే తక్కువ పాలు ఇచ్చే పశుసంతతిలో  పాల దిగుబడి శాతం పెంచడానికి దశాబ్దాలుగా ప్రయత్నించినా పూర్తిస్థాయి ఫలితాలు రావటం లేదని వివరించారు. విదేశాల్లో అమలులో ఉన్న  కృత్రిమ గర్భోత్పత్తి (ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్) విధానాలను తమ రాష్ట్రంలో అవలంబిస్తుంటే ఫలితాలు యాభై శాతానికి మించి రావటం లేదన్నారు. 
అయితే ఐవీఎఫ్ విధానంలో పుట్టిన  పశు సంతతిలో 60% పశువులు 8 నుంచి 10 లీటర్ల వరకు పాలిచ్చే సామర్ధ్యం పెరిగిందన్నారు. ఏపీలో  స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా రోజుకు 20 లీటర్లకు పైగా పాలిచ్చే పశుసంతతి ఉందని తెలిపారు. 
మేలుజాతి జన్యు సంతతిని వేగవంతంగా పెంచడానికి కృషి
  ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) పద్ధతిని ఉపయోగించటం ద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో మేలుజాతి పశుసంతతిని అభివృద్ధి సాధ్యమవుతుందని,  కృత్రిమ గర్భోతత్తిలో ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతులలో ఒక రైతు తన పశువుల నుంచి  6 పెయ్యదూడలను పొందగలిగితే, నూతన ఎంబ్రియో ట్రాన్స్ ఫర్ టెక్నాలజీని, ఐవీఎఫ్ టెక్నిక్ లను సమ్మిళితం చేసి ఉపయోగిస్తే 200 నుంచి 250 పెయ్యదూడలను పొందే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రికి పెనిసిల్వేనియా ప్రతినిధులు వివరించారు. ఈ ఆధునిక కృత్రిమ గర్భోత్పత్తి విధానాల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రావసరాలకు అనుగుణంగా 10 వేల మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పశువులకు పోషకాహారం
  రుమెన్ మైక్రోబియల్ జీనోమ్ టెక్నాలజీ ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ పోషకాలు కలిగిన గ్రాసాన్ని పశువులకు అందించే వీలుంటుంది యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ  తాజాగా కనుగొన్న  ఫీడింగ్ మెథడ్స్,  ప్రోబయోటిక్స్ విధానాల వల్ల రైతుకు ఆర్ధికంగా  మేలు జరిగేలా చూడాలన్నారు.

  ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజర్ల ద్వారా మన పాడి ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ అంశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే  యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ప్రతినిధి బృందం మిల్క్ మిషన్ ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో మన అభ్యుదయ రైతులు, పశువైద్యులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా శిక్షణ అందనుంది.
కొత్తగా కుదుర్చుకుంటున్న ఎంఓయూలతో ప్రయోజనాలు
మిల్క్ మిషన్ ఒప్పందంవల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పాడి ఉత్పత్తి పెరుగుదల, ఉత్పత్తి వ్యయం తగ్గించటం,లాభాలను పెంచటానికి తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఈ రంగంలో రెండంకెల వృద్ధికి దోహదం  చేస్తుందని అన్నారు.  సమావేశంలో సీఎంఓ సహాయ కార్యదర్శి శ్రీ అడుసుమల్లి రాజమౌళి, యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా మిల్క్ మిషన్ ప్రాజెక్టు ప్రతినిధులు, సీనియర్ ప్రొఫెసర్  డా. డేవిడ్ గ్యాలగన్,  అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తి పిట్టా, డైరెక్టర్ డాక్టర్ విక్టర్ అబ్సలోన్ మెడినా తదితరులు పాల్గొన్నారు.