కావలి 29.5.16
కుర్ కురే కావాలని అల్లరి పెడుతూ ప్రతి రోజూ వేదిస్తున్నటువంటి ఈ పిల్లలు పెద్దవాడు తరుణ్ ,చిన్నవాడు శివ థావణ్ ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అసలు ఆ నిర్ణయం ఏంటి..
ప్రతీ రోజూ లాగే ఈరోజు కూడా మారాం చేస్తూ ఏడుస్తున్న వీరికి వారి తల్లిదండ్రులు ఎంత చెప్పినా లాభం లేకుండా పోయింది.
చివరకు వారికి ఒక ఉపాయం తట్టింది.
వీరికి ఇలా చెబితే లాభం లేదని రెండు కుర్ కురే ప్యాకెట్లు తెప్పించారు... అవి వారి చేతికి ఇవ్వ బోయేముందు ఇలా చెప్పారు.
కుర్ కురే మీకు ఇవ్వాలంటే మేము చెప్పినట్టు వినాలని అన్నారు. పిల్లలు కూడా సరే అన్నారు.
ఒక అగ్గి పెట్టి తెచ్చి కుర్ కురే ప్యాకెట్ ని తెరిచి దానిలో ఉన్న పలుకులను వెలిగించమన్నారు.. పిల్లలు మూతి వంకర పెడుతూనే వాటిని వెలిగించారు.
ఒక్క సారిగా దీపావళి కాకరవత్తిలా మండడంతో పిల్లలు ఆ ప్యాకెట్ లను వదిలి పరిగెత్తారు. వాటి నుండి కారుతున్న ఆయిల్ ను చూసి యాక్ అంటూ దూరం జరిగారు..
వారికి అవి తింటే బాగలేకుండా వస్తుందని నచ్చజెప్పడంతో పిల్లలు వాటి వైపు చూస్తూనే వాటిని తినడం బహిష్కరించారు.
ఇలా పిల్లల యొక్క అలవాటును మార్చినటువంటి తల్లి దండ్రులకు అభినందనలు తెలియజేద్దాం...
షేర్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని....
No comments:
Post a Comment