భారతీయ జనతా పార్టీ దగదర్తి మండల శాఖ, మండలం లోని త్రాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు నడుం బిగించినది...
ఇందులో భాగంగా దగదర్తి మండల అద్యక్షులు కొంచా శివరామ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా వాహనాన్ని (ట్రాక్టర్) దగదర్తి మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా విగ్నప్తుల దినాన్ని పురస్కరించుకొని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంబించడం జరిగినది. మండలం లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న అనంతవరం గ్రామంలోని లయన్స్ నగర్, రంగసముద్రం, మనుబోలుపాడు, లింగాలపాడు, దుండిగం, మారిళ్ళపాడు, అయిటంపాడు, యలమంచిపాడు, కొత్తూరు, తదితర గ్రామాలతో పాటు మండలంలో కార్యకర్తలు ఎవరైనా తమ ప్రాంతం లో త్రాగు నీటి సమస్య ఉన్నదని తెలియజేస్తే వెంటనే మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరి వెంకట సత్యనారాయణ తెలియజేసారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన నెల్లూరు ముద్దుబిడ్డ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ వెంకయ్య నాయుడుగారు ప్రవేశ పెడుతున్న ప్రజా సంక్షేమ పధకాలను ఆదర్శంగా తీసుకొని, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ గారి సహకారంతో ఉచిత మంచినీటి సరఫరా వాహనాన్ని ప్రారంబించ గలిగామని, రానున్న రోజులలో మరిన్ని కార్యక్రమాలతో మండలంలో ప్రజల సమస్యలను తీరుస్తూ భాజపా అభివృద్ధికి పాటుపడతానని మండల అద్యక్ష్యులు మరియు దాత కొంచా శివరామ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ తోపాటు, కావలి అసెంబ్లీ కన్వినర్ CVC సత్యం, జిల్లా లీగల్ సెల్ కో కన్వినర్ పాతపాటి రమణారెడ్డి, దగదర్తి మండల భా.జ.పా అద్యక్షులు కొంచా శివరామ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అడిగోపలి శేషయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగోలు వెంకటేశ్వర్లు, భాజపా నాయకులు మట్టా మల్లికార్జున, డి.రమణయ్య, ఏ.శ్రీనివాసులు, డి. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment