Sunday, May 29, 2016

కావలి లో యన్.టి.ఆర్ 94 వ జయంతి వేడుకలు...!!!

తెలుగుదేశం పార్టీ ఆవిర్బావకుడు, నటకిరీటి, తెలుగు జాతిని నలుమూలలా వ్యాపింప జేసిన  కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 94 వ జయంతి వేడుకలు కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘణంగా నిర్వహించడం జరిగింది.

పట్టణ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి గుప్తా, ఛైర్మన్ పోతుగంటి అలేఖ్య, యన్.టి.ఆర్ అభిమాన సంఘ నాయకులు జ్యోతీబాబురావు ఆధ్వర్యంలో స్ధానిక యమ్.ఆర్.వో ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి యన్.టి.ఆర్ విగ్రహముకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి.  ఛైర్ పర్సన్  పోతుగంటి అలేఖ్య, యన్.టి.ఆర్ అభిమాన సంఘ నాయకులు జ్యోతీబాబురావు, గుత్తికొండ కిషోర్, సన్నెబోయిన నారాయణ, మహిళా నాయకురాలు శ్రీదేవి ,  బి.సి సెల్  నాయకుడు తాళ్ళపాలెం వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు,యన్.టి.ఆర్ అభిమానులు పాళ్గొన్నారు..

No comments:

Post a Comment