Tuesday, May 31, 2016

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాలి. ..!!!

ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత..

సామరస్యంగా, సుహృద్భావంతో సాగాల్సిన విభజన చర్చల్ని వార్ రూమ్ పేరుతో ఉద్రిక్తంగా మార్చింది కాంగ్రెస్.సుస్థిర ప్రభుత్వాలు లేని కాలంలోనే రాష్ట్రంలో ఆనాడు సుస్థిర అభివృద్ధి సాధించాం.

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాలి.....

ఆఫీసులో వున్నా, రోడ్డుమీద వున్నా, ప్రయాణాల్లో వున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సరిగ్గా  11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలి.

జూన్ 3న ‘అశాస్త్రీయ  విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు.

3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నాం.

జూన్ 4న ‘ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలు’ అనే అంశంపై సదస్సు.

రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ, ఇంకా అనేక విజయాలపై 4న జరిగే సదస్సులో చర్చ.

జూన్ 5న ‘వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు.

‘జల వనరులే జాతి  సంపద’ అనే  స్ఫూర్తితో  ప్రాథమిక రంగ మిషన్‌, పొలం పిలుస్తోంది.., నీరు-చెట్టు, వాటర్‌గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాలపై చర్చ
జూన్ 6న ‘పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టారులో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు.

పరిశ్రమల రంగ మిషన్,  సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్, గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్, అత్యధికమందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్,  పర్యాటక, ఆతిధ్య రంగాలపై సదస్సు.

No comments:

Post a Comment