Tuesday, May 31, 2016

కృష్ణ మోహన్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది..!!!

కావలి పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత  33 సంవత్సరాలు సుధీర్ఘంగా సేవలందించి నేడు పదవీ విరమణ చేస్తున్నటు వంటి పొన్నారు కృష్ణ మోహన్ గారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు...

సిబ్బంది ,  కృష్ణమోహన్ గారితో పని చేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.. 

పనిలో సిన్సియారిటీని ఆయనని చూసి నేర్చుకోవాలని,కస్టమర్ల తో ప్రవర్తించే ధోరని, తెలియని విషయాలలో మార్గదర్శిగా ఉండి, ఎంతో ఓర్పుతో , సహనంతో మెలిగి , అందరి మనసులలో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు...

మా తరుపు నుండి కూడా పొన్నూరు కృష్ణమోహన్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..

మనమత్రిక మేనేజ్ మెంట్....

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాలి. ..!!!

ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత..

సామరస్యంగా, సుహృద్భావంతో సాగాల్సిన విభజన చర్చల్ని వార్ రూమ్ పేరుతో ఉద్రిక్తంగా మార్చింది కాంగ్రెస్.సుస్థిర ప్రభుత్వాలు లేని కాలంలోనే రాష్ట్రంలో ఆనాడు సుస్థిర అభివృద్ధి సాధించాం.

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాలి.....

ఆఫీసులో వున్నా, రోడ్డుమీద వున్నా, ప్రయాణాల్లో వున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సరిగ్గా  11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలి.

జూన్ 3న ‘అశాస్త్రీయ  విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు.

3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నాం.

జూన్ 4న ‘ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలు’ అనే అంశంపై సదస్సు.

రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ, ఇంకా అనేక విజయాలపై 4న జరిగే సదస్సులో చర్చ.

జూన్ 5న ‘వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు.

‘జల వనరులే జాతి  సంపద’ అనే  స్ఫూర్తితో  ప్రాథమిక రంగ మిషన్‌, పొలం పిలుస్తోంది.., నీరు-చెట్టు, వాటర్‌గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాలపై చర్చ
జూన్ 6న ‘పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టారులో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు.

పరిశ్రమల రంగ మిషన్,  సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్, గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్, అత్యధికమందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్,  పర్యాటక, ఆతిధ్య రంగాలపై సదస్సు.

విట్స్ ఇంజనీరింగ్ విధ్యార్ది బిట్రగుంట సమీపములో అనుమానాస్పద మృతి...!!!


కావలి పట్టణం లోని విట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వేలూరు చిరంజీవి అను విద్యార్ది బిట్రగుంట సమీపంలో అనుమానాస్పదమైన స్థితిలో మృతదేహమై కనిపించాడు.

ఈ విద్యార్ది కళాశాలలో మెకానికల్ 3 వ సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది.
విద్యార్ది యొక్క స్వస్థలం నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం...

ఇది హత్య నా లేక ఆత్మహత్యనా అని తెలియాల్సి ఉంది...

Sunday, May 29, 2016

జూన్ 1న టి.డి.పి తీర్థం పుచ్చుకోనున్న ప్రకాశం జిల్లా వై.సి.పి ఎమ్మెల్యే...!!!

ప్రకాశం  జిల్లా గిద్దలూరు వై.యస్.ఆర్ సి.పి, 
యమ్.ఎల్.ఎ  M.అశోక్ రెడ్డి జూన్ 1వ తేదిన తెలుగుదేశం పార్టీలో చేరనున్నాడు.

విజయవాడలో CM చంద్రబాబునాయుడు సమక్షంలో నియోజకవర్గంలోని MPP లు, ZPTCలు, సర్పంచ్ లతో కలిసి టీడీపీ లో చేరుతారు.

కుర్ కురే పై దండయాత్ర మొదలుపెట్టిన చిన్నారులు....!!!


కావలి 29.5.16

కుర్ కురే కావాలని అల్లరి పెడుతూ ప్రతి రోజూ వేదిస్తున్నటువంటి ఈ పిల్లలు పెద్దవాడు తరుణ్ ,చిన్నవాడు శివ థావణ్ ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అసలు ఆ నిర్ణయం ఏంటి..

ప్రతీ రోజూ లాగే ఈరోజు కూడా మారాం చేస్తూ ఏడుస్తున్న వీరికి  వారి తల్లిదండ్రులు ఎంత చెప్పినా లాభం లేకుండా పోయింది.

చివరకు వారికి ఒక ఉపాయం  తట్టింది.

వీరికి ఇలా చెబితే లాభం లేదని రెండు కుర్ కురే ప్యాకెట్లు తెప్పించారు... అవి వారి చేతికి ఇవ్వ బోయేముందు ఇలా చెప్పారు.

కుర్ కురే మీకు ఇవ్వాలంటే మేము చెప్పినట్టు వినాలని అన్నారు. పిల్లలు కూడా సరే అన్నారు.

ఒక అగ్గి పెట్టి తెచ్చి కుర్ కురే ప్యాకెట్ ని తెరిచి దానిలో ఉన్న పలుకులను వెలిగించమన్నారు.. పిల్లలు మూతి వంకర పెడుతూనే వాటిని వెలిగించారు.

ఒక్క సారిగా దీపావళి కాకరవత్తిలా మండడంతో పిల్లలు ఆ ప్యాకెట్ లను వదిలి పరిగెత్తారు. వాటి నుండి కారుతున్న ఆయిల్ ను చూసి యాక్ అంటూ దూరం జరిగారు..

వారికి అవి తింటే బాగలేకుండా వస్తుందని నచ్చజెప్పడంతో పిల్లలు వాటి వైపు చూస్తూనే  వాటిని తినడం బహిష్కరించారు.

ఇలా పిల్లల యొక్క అలవాటును మార్చినటువంటి  తల్లి దండ్రులకు అభినందనలు తెలియజేద్దాం...

షేర్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని....

కావలి లో యన్.టి.ఆర్ 94 వ జయంతి వేడుకలు...!!!

తెలుగుదేశం పార్టీ ఆవిర్బావకుడు, నటకిరీటి, తెలుగు జాతిని నలుమూలలా వ్యాపింప జేసిన  కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 94 వ జయంతి వేడుకలు కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘణంగా నిర్వహించడం జరిగింది.

పట్టణ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి గుప్తా, ఛైర్మన్ పోతుగంటి అలేఖ్య, యన్.టి.ఆర్ అభిమాన సంఘ నాయకులు జ్యోతీబాబురావు ఆధ్వర్యంలో స్ధానిక యమ్.ఆర్.వో ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి యన్.టి.ఆర్ విగ్రహముకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి.  ఛైర్ పర్సన్  పోతుగంటి అలేఖ్య, యన్.టి.ఆర్ అభిమాన సంఘ నాయకులు జ్యోతీబాబురావు, గుత్తికొండ కిషోర్, సన్నెబోయిన నారాయణ, మహిళా నాయకురాలు శ్రీదేవి ,  బి.సి సెల్  నాయకుడు తాళ్ళపాలెం వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు,యన్.టి.ఆర్ అభిమానులు పాళ్గొన్నారు..

Wednesday, May 25, 2016

ఏపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నూతన కార్యవర్గము...!!!

(ఇది అడహక్ కమిటీ, కొన్ని అవసరమైన చేర్పులు  చేయబడును )

అధ్యక్షులు :     శ్రీ చలసాని శ్రీనివాస్ గారు
ఉపాధ్యక్షులు : శ్రీ డా. P.U.B. శర్మ గారు (Retd. Professor)
                     శ్రీ జి. అప్పలనాయుడు గారు
                     శ్రీ ఏ. ఎస్. గుర్రప్ప గారు

ప్రధాన కార్యదర్శి : శ్రీ కె. రామకృష్ణ గారు
         కార్యదర్శి : శ్రీ ప్రొ. సదాశివ రెడ్డి గారు
          కార్యదర్శి : శ్రీ కూసంపూడి శ్రీనివాస్ గారు

సహాయ కార్యదర్శి : శ్రీ సయ్యద్ రఫీ గారు

సహాయ కార్యదర్శి : శ్రీ జి. వి. ఎస్. ఎన్. రాజు గారు
                            శ్రీ చిలకా రాజేష్ గారు
                             శ్రీ ఎస్. సత్యనారాయణ గారు

కార్యనిర్వాహక కార్యదర్శి : శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరావు గారు

సంయుక్త కార్యదర్శి : శ్రీ నరసింహా రావుగారు

మీడియా కమిటీ : శ్రీ అన్నాబత్తుని సదాశివరావు గారు
                         శ్రీ హరనాథ రెడ్డి గారు
                         శ్రీ నల్లి ధర్మారావు గారు
                         శ్రీ ఐ వి సుబ్బారావు గారు
                      
సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ :  శ్రీ డా. బాలకృష్ణ గారు
                                                శ్రీ గని గారు
                                                 శ్రీ చంద్రనాయాక్ గారు

న్యాయవాద విభాగం : శ్రీ అజయ్ కుమార్ గారు
                               శ్రీ ముప్పాళ్ళ సుబ్బారావు గారు
                              శ్రీ ఆలపాటి శ్రీనివాస్ గారు
                              శ్రీ మట్టా జయకర్ గారు

డాక్టర్ల విభాగం : శ్రీ డా. శ్యాం సుందర్ గారు
                       శ్రీ డా. సి. అబ్బయ్య గారు
                        శ్రీ డా. రవి గారు
                         శ్రీ డా. అజయ్ మారేడు గారు

టీచర్స్ విభాగం : శ్రీ జోసెఫ్ సుదీర్ కుమార్ గారు,
                       శ్రీ కత్తి నరసింహా రెడ్డి గారు

విద్యార్ధి విభాగం : శ్రీ సాకే నరేష్ గారు,
                       శ్రీ రవి కిరణ్ గారు,
                      శ్రీ గోపి గారు,
                      శ్రీ మల్లికార్జున్ గారు

యువజన విభాగం : శ్రీ ఇందుకూరి బయ్యన్న గారు,
                            శ్రీ ఎన్. లెనిన్ బాబు గారు
                            శ్రీ రాయపాటి జగదీశ్ గారు

మేధావుల విభాగం : శ్రీ హనుమంత రెడ్డి గారు
                            శ్రీ పన్నాల సత్యనారాయణ మూర్తి గారు
                            శ్రీ ప్రొ. సాయి కృష్ణ గారు 

కార్మిక విభాగం : AITUC, CITU, INTUC & Other unions

మహిళా విభాగం : శ్రీమతి దుర్గాభవాని గారు, AIDWA

రైతు విభాగం : శ్రీ యెర్నేని నాగేంద్ర నాథ్ గారు
                    శ్రీ కె. వి. వి. ప్రాసాద్ గారు,
                   శ్రీ వంగల సుబ్బారావు గారు
                    శ్రీ పి. రామచంద్రయ్య గారు
                   శ్రీ M.V.S నాగిరెడ్డి గారు
                   శ్రీ బండారు శ్రీనివాస్ గారు
                   కిసాన్ కాంగ్రెస్

ఐ టి విభాగం : శ్రీ డేవిడ్ గారు
                    శ్రీ నన్నపునేని శ్రీనివాస్ గారు

గౌరవ సలహా మండలి :
శ్రీ వడ్డే శోభనాదీశ్వర రావు గారు, Ex. MP
శ్రీ ఆచార్య వియన్నారావు గారు Ex. Vice Chancellor ANU
శ్రీ ప్రొ. నడుపల్లి శ్రీరామ రాజు గారు MA. Phd.,(Retd,)
శ్రీ డా. కొలకలూరి ఇనాక్ గారు Ex. Vice Chancellor SVU
శ్రీ ఆచార్య జార్జి విక్టర్ గారు Ex. Vice Chancellor Adikavi Nannayya University
శ్రీ K.S. లక్ష్మణ్ రావు గారు Ex. MLC

మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు శ్రీమతి పందిళ్ళపల్లి అరుణమ్మ సంస్మరణ సభ...!!!

నెల్లూరు జిల్లా మహిళా కాంగ్రెస్  దివంగత అద్యక్షురాలు శ్రీమతి పందిళ్ళపల్లి అరుణమ్మ సంస్మరణ సభ బుధవారం నెల్లూరు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు .జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పనబాక కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ శ్రీమతి పనబాక లక్ష్మీ ,వైఎస్ఆర్ సిపి  ఎమ్మెల్యే లు కో టంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,కిలివేటి సంజీవయ్య ,తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు జక్కా వెన్కయ్య పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు

Tuesday, May 24, 2016

ఎంప్లాయిమెంట్ అధికారులతో ఐటీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి సమీక్ష...!!!

అనంతపురం నగరం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన పై ఎంప్లాయిమెంట్ అధికారులతో సోమవారం ఐటీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి సమీక్ష....
ఐటీ మినిస్టర్ పల్లె రఘునాథరెడ్డి కామెంట్స్.....
1.నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం...
2. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...
3. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం... ప్రభుత్వం దశల వారిగా ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపడుతోంది..

శివ శివా ఏమిటీ ఎండా...!!!

కావలి లో హల్ చల్ చెస్తున్న మెాటర్ సైకిల్ ( టు వీలర్స్ )గోడుగులు.. ఎండ వేడిమికి భరించలేక ఇలా వాహనాలకి గొడుగులు పెట్టుకుని ఎండదెబ్బ తగలకుండా నివారించుకుంటున్నారు.

త్రాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు నడుం బిగించిన భారతీయ జనతా పార్టీ...!!!

భారతీయ జనతా పార్టీ దగదర్తి మండల శాఖ, మండలం లోని త్రాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు నడుం బిగించినది...

ఇందులో భాగంగా దగదర్తి మండల అద్యక్షులు కొంచా శివరామ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా వాహనాన్ని (ట్రాక్టర్) దగదర్తి మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా విగ్నప్తుల దినాన్ని పురస్కరించుకొని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంబించడం జరిగినది. మండలం లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న అనంతవరం గ్రామంలోని లయన్స్ నగర్, రంగసముద్రం, మనుబోలుపాడు, లింగాలపాడు, దుండిగం, మారిళ్ళపాడు, అయిటంపాడు, యలమంచిపాడు, కొత్తూరు, తదితర గ్రామాలతో పాటు మండలంలో కార్యకర్తలు ఎవరైనా తమ ప్రాంతం లో త్రాగు నీటి సమస్య ఉన్నదని తెలియజేస్తే వెంటనే మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరి వెంకట సత్యనారాయణ తెలియజేసారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన నెల్లూరు ముద్దుబిడ్డ, కేంద్ర పట్టణాభివృద్ధి  శాఖా మాత్యులు శ్రీ వెంకయ్య నాయుడుగారు ప్రవేశ పెడుతున్న ప్రజా సంక్షేమ పధకాలను ఆదర్శంగా తీసుకొని, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ గారి సహకారంతో ఉచిత మంచినీటి సరఫరా వాహనాన్ని ప్రారంబించ గలిగామని, రానున్న రోజులలో మరిన్ని కార్యక్రమాలతో మండలంలో ప్రజల సమస్యలను తీరుస్తూ భాజపా అభివృద్ధికి పాటుపడతానని మండల అద్యక్ష్యులు మరియు దాత కొంచా శివరామ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ తోపాటు, కావలి  అసెంబ్లీ కన్వినర్ CVC సత్యం, జిల్లా లీగల్ సెల్ కో కన్వినర్ పాతపాటి రమణారెడ్డి, దగదర్తి మండల భా.జ.పా అద్యక్షులు కొంచా శివరామ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అడిగోపలి శేషయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగోలు వెంకటేశ్వర్లు, భాజపా నాయకులు మట్టా మల్లికార్జున, డి.రమణయ్య, ఏ.శ్రీనివాసులు, డి. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.