Sunday, April 26, 2015

ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారు...


చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారని మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలని, ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపంసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయాలని సూచించారు.  ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోడీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment